: బొత్స, ధర్మానలపై విచారణ జరిపిస్తాం: మంత్రి పల్లె రఘునాథరెడ్డి
గత ప్రభుత్వ హయాంలో జరిగన మద్యం సిండికేట్ల అక్రమాలపై విచారణ జరిపిస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులపై కూడా విచారణ జరిపిస్తామని తెలిపారు. లేపాక్షి, వాన్ పిక్ కుంభకోణంపై పునర్విచారణ జరుగుతుందని... అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అక్రమంగా భూములను కొల్లగొట్టారని... వాటినన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.