: ఇకనైనా పాకిస్థాన్ తన తీరు మార్చుకోవాలి: సీపీఐ


పాక్ లోని పెషావర్ లో సైనిక పాఠశాలపై తాలిబన్లు జరిపిన నరమేధాన్ని సీపీఐ ఖండించింది. ఉగ్రవాదులు 130 మందిని హతమార్చడం అత్యంత అమానుషమని ఆ పార్టీ నేత డి.రాజా అన్నారు. ఈ ఘటనతో, ఇకనైనా పాకిస్థాన్ కు కనువిప్పు కలగాలని, తన తీరు మార్చుకోవాలని చెప్పారు. తన భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలను ఇకపై పాకిస్థాన్ ఎంతమాత్రం అనుమతించరాదని కోరారు.

  • Loading...

More Telugu News