: చంద్రబాబు రాజీనామా చేయాలంటున్న జ్యోతుల నెహ్రూ
రుణమాఫీ అమలు విషయంలో వైఎస్సార్సీపీ మరోమారు సీఎం చంద్రబాబుపై విమర్శల దాడికి దిగింది. శాసనసభలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చడం లేదని అన్నారు. ఇప్పుడు రుణమాఫీ అంశంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారని, రైతులను రుణాలు చెల్లించాలని కోరుతున్నారని నెహ్రూ ఆరోపించారు. రైతులు రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న విషయం బాబుకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. ఏపీని పాలించే హక్కు బాబుకు లేదని, తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరారు.