: కోహ్లీ చూపిన బాటలో నడుస్తానంటున్న ధోనీ


విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు తొలి టెస్టులో చూపిన దూకుడును మిగతా మ్యాచ్ లలో చూపుతామని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. గాయం కారణంగా ఆసీస్ తో తొలి టెస్టుకు దూరమైన ధోనీ, రేపటి నుంచి జరిగే రెండో టెస్టుకు సారథ్యం వహించనున్న సంగతి తెలిసిందే. కోహ్లీ కెప్టెన్ గా బరిలోకి దిగిన భారత్ తొలి టెస్టులో ఓడిపోయినా, పోరాట పటిమ చూపిందని, ధోనీ ప్రశంసించాడు. ఈ సిరీస్ లో దూకుడైన క్రికెట్ ఆడుతామని ధోనీ చెప్పాడు. కాగా, సిడ్నీ ఘటన నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియం లోపల, వెలుపల పెద్ద ఎత్తున బలగాలను మోహరించినట్టు అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News