: పాక్ ఉగ్రవాదుల చెరలో 500 మంది విద్యార్థులు
పాక్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 22 మంది చనిపోయారు. మృతి చెందిన వారిలో 20 మంది విద్యార్థులు, ఒక టీచర్, ఒక జవాను ఉన్నారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వీరిలో ముగ్గురు ముష్కరులను పాక్ సైన్యం కాల్చి చంపింది. ఉగ్రవాదుల చెరలో మరో 500 మంది బందీలుగా ఉన్నారని సమాచారం. విద్యాలయంపై ఉగ్రదాడిని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు.