: కోహ్లీ పరిపూర్ణ కెప్టెన్ కాజాలడు: గవాస్కర్
కెరీర్ లో తొలిసారిగా ఓ టెస్ట్ మ్యాచ్ కి కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ పరిపూర్ణ కెప్టెన్ కాలేడని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తొలి మ్యాచ్ లో తను రాణించినా, జట్టును విజయపథంలో నడిపించడంలో కోహ్లీ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో, కోహ్లీ 'దూకుడు' వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి. క్రికెట్ చరిత్రలో పర్ఫెక్ట్ కెప్టెన్ ఎవరూలేరని గవాస్కర్ అన్నారు. కోహ్లీ నుంచి పరిపూర్ణతను ఆశించటం అత్యాశేనని ఆయన అన్నారు. తదుపరి మ్యాచ్ లకు ధోనీయే కెప్టెన్ అని, అందులో సందేహాలు లేవని తెలిపారు.