: తెలంగాణలో హాఫ్ ఇయర్లీ పరీక్షలు వాయిదా


తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో హాఫ్ ఇయర్లీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. ఈ నెల 17 నుంచి 23 వరకు నిర్వహించాల్సిన అర్ధ సంవత్సరం (సెకండ్ టర్మ్) పరీక్షలను జనవరి 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు విద్యాశాఖ కమిషనర్ నుంచి ప్రాంతీయ, జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు వెళ్లాయి. పరీక్షలు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందన్న విషయం వెల్లడి కాలేదు.

  • Loading...

More Telugu News