: నేడు గుంటూరు జిల్లాకు వైఎస్ జగన్


వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరు రూరల్ మండలానికి చెందిన పార్టీ నేత రాతంశెట్టి సీతారామాంజనేయులు కుమారుడు రాజమన్నార్ వివాహ రిసెప్షన్ కు జగన్ హాజరుకానున్నారు. మండలంలోని లాలూపురం గ్రామ సమీపంలోని భవానీపురంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు హాజరయ్యే జగన్, నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం చేరుకునే జగన్, అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా గుంటూరు చేరుకుంటారు. రిసెప్షన్ అనంతరం ఆయన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నట్లు వైకాపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు.

  • Loading...

More Telugu News