: మార్టిన్ కేఫ్ లోకి చొరబడ్డ పోలీసులు...విశ్వకాంత్ క్షేమం


30 మందిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదితో ఆస్ట్రేలియా పోలీసులు పోరు సాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మార్టిన్ కేఫ్ లోకి దూసుకెళ్లిన పోలీసులు ఉగ్రవాది నుంచి బందీలను విడిపిస్తున్నారు. గుంటూరు జిల్లావాసి విశ్వకాంత్ సహా 13 మంది బందీలను పోలీసులు సురక్షితంగా బయటకు పంపారు. ఉగ్రవాది చెర నుంచి బయటపడ్డ విశ్వకాంత్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఇదిలా ఉంటే, కేఫ్ లోకి చొచ్చుకెళ్లిన పోలీసులపైకి ఉగ్రవాది కాల్పులకు దిగాడు. దీంతో పోలీసులు కూడా అతడిపై కాల్పులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బందీలకు గాయాలైనట్లు సమాచారం.

  • Loading...

More Telugu News