: నకిలీ ఈ-మెయిల్ ఖాతాదారుడిపై హృతిక్ రోషన్ ఫిర్యాదు


ఆన్ లైన్ లో తన పేరిట నకిలీ ఈ మెయిల్ తో చలామణి అవుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నాలుగు పేజీల ఫిర్యాదును జూహు పోలీస్ కమిషనర్ కు పంపాడు. వెంటనే hroshan@email.comను మూసి వేయాలని కోరాడు. అంతేగాక మెయిల్ ఖాతాను వాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని తెలిపాడు. మరోవైపు ఫిర్యాదు ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని కమిషనర్ మారియా తెలిపారు. ఇటీవల ట్విట్టర్, ఫేస్ బుక్ లలో హృతిక్ అభిమానులకు అందుబాటులో ఉంటున్నాడు.

  • Loading...

More Telugu News