: చక్రితో చాలా సినిమాలు చేయవచ్చనుకున్నా: దాసరి
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి భౌతికకాయానికి సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను భవిష్యత్తులో చక్రితో ఎన్నో సినిమాలు చేయవచ్చని భావించానని, అతను అందరికి కావాల్సిన వాడని పేర్కొన్నారు. చక్రి స్వరం బాగుంటుందని, తనకెంతో ఇష్టమని తెలిపారు. చక్రి ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలించాంబర్ వద్ద ఉంచారు.