: సాయంత్రం 4.30 గంటలకు చక్రి అంత్యక్రియలు
సినీ సంగీత దర్శకుడు చక్రి అంత్యక్రియలు ఈ సాయంత్రం 4.30 గంటలకు జరగనున్నాయి. పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం అభిమానుల దర్శనార్థం భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ వద్ద ఉంచారు. అనంతరం అక్కడ నుంచి చక్రి నివాసానికి తరలిస్తారు. అక్కడ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటికకు తీసుకెళతారు.