: జపాన్ ప్రధానికి మోదీ అభినందనలు
జపాన్ ప్రధానిగా మూడవసారి ఎన్నికయిన షింజో అబేకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టపరిచేందుకు ఆయనతో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. "ఎన్నికల్లో విజయం సాధించిన షింజో అబేకు నా అభినందనలు. మీ సమర్థవంతమైన నాయకత్వంలో జపాన్ పురోగతిలో కొత్త శిఖరాలకు వెళుతుందని ఆశిస్తున్నాం" అని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా కూడా ట్విట్టర్ లో మోదీ నివాళులర్పించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఆయన చేసిన అవిరళ కృషికి భారతదేశం మొత్తం ఆయనకు రుణపడి ఉంటుందన్నారు.