: బ్రిస్బేన్ లో భారత క్రికెటర్లకు భద్రత పెంపు... సిడ్నీ టెర్రర్ ఎఫెక్ట్


సిడ్నీలో సాయుధులు సాధారణ పౌరులను బంధీలుగా చేసిన ఘటన నేపథ్యంలో, ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత క్రికెటర్లకు భద్రతను పెంచారు. రెండో టెస్టు కోసం టీమిండియా ప్రస్తుతం బ్రిస్బేన్ లో ఉంది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మాట్లాడుతూ, "ఆసీస్ క్రికెట్ పెద్దలతో మేం నిరంతరం మాట్లాడుతున్నాం. ఆస్ట్రేలియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. మా ఆటగాళ్ల భద్రతే మాకు అత్యంత ప్రధానమైనది. అయినా, బ్రిస్బేన్ లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. ముందుజాగ్రత్తగా భద్రత పెంచారు. టీమిండియా రక్షణ కోసం అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. సీఏ చర్యలతో మేమెంతో సంతోషిస్తున్నాం" అని వివరించారు.

  • Loading...

More Telugu News