: నాలుగు కోట్ల తెలంగాణ గుండెల్లో చక్రి ఉన్నాడు: పొన్నాల
చిన్న వయసులోనే కేవలం స్వశక్తి, ప్రతిభతో సినీ పరిశ్రమలో చక్రి ఉన్నత స్థానాన్ని అధిరోహించాడని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించిన చక్రిని ఎన్నో అవార్డులు వరించాయని చెప్పారు. ఫిలింఫేర్, నంది అవార్డులు చక్రికి కేవలం గుర్తింపు మాత్రమే అని... నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో చక్రి ఉన్నాడని అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ చక్రి ఇంత చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని చెప్పారు.