: చక్రి మరణ వార్తను నమ్మలేకపోతున్నా: దర్శకుడు ఎన్.శంకర్
ఎంతో మంచి వ్యక్తి, తన మిత్రుడు చక్రి మరణ వార్తను నమ్మలేకపోతున్నానని సినీ దర్శకుడు ఎన్.శంకర్ అన్నారు. తన జీవితంలో ఇంత షాక్ కు ఎన్నడూ గురికాలేదని చెప్పారు. స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి చక్రి అని... స్నేహితులను ఎంతో ప్రేమించేవాడని తెలిపారు. ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి చక్రి అని శంకర్ కొనియాడారు. సినిమాలకు సంగీతాన్ని అందిస్తూనే, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంచి సంగీతాన్ని అందించిన చక్రి మరణం... చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.