: పోలీసు కాల్పుల్లో గాయపడిన వ్యక్తి మృతి
ఓ వ్యక్తి చేసిన చిన్న పొరపాటు చివరకు అతని ప్రాణాలనే బలిగొంది. వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా చర్ల మండలం దోసిళ్లపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా, నరసింహారావు అనే వ్యక్తి తన వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. దీంతో, అతడిని మావోయిస్టుగా భావించిన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నరసింహారావు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఇతడిని చికిత్స నిమిత్తం హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నరసింహారావు మృతి చెందాడు.