: పెళ్లి ప్రపోజల్ వికటించింది... కానీ, కథ సుఖాంతమే!


నెదర్లాండ్స్ లో ఓ యువకుడు తన ప్రేయసికి వినూత్న తరహాలో పెళ్లి ప్రపోజల్ కు యత్నించి, భారీ నష్టానికి కారణమయ్యాడు. ఐజల్ స్టీన్ పట్టణంలో సదరు ప్రేమికుడు తన ప్రియురాలిని వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు. పెళ్లికి ముందు ప్రపోజ్ చేయాలి కదా! ఆ కార్యక్రమాన్ని కాస్త అడ్వెంచరస్ గా ప్లాన్ చేద్దామనుకున్నాడు. ఓ భారీ క్రేన్ ను అద్దెకు తీసుకున్నాడు. దాని సాయంతో నేరుగా ప్రియురాలి బెడ్ రూం కిటికీ ముందు వాలాలని అతగాడి ఆలోచన! అలా ఆమెను సర్ ప్రైజ్ చేసి, ఓ గీతం వినిపించి, ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తేవాలనుకున్నాడు. క్రేన్ పైకి ఎక్కి కార్యాచరణకు పూనుకున్నాడీ ప్రేమ పిపాసి. అంతా అనుకున్నట్టే జరిగితే కథ ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ, ఆ క్రేన్ కాస్తా అదుపుతప్పి మరో ఇంటిపై పడింది. దాంతో, ఆ ఇంటి పైకప్పుకు భారీ కన్నం పడింది. ఇంకేముంది, ఆ భవన సముదాయం కూలిపోతుందేమోనని అందరూ హడలిపోయారు. అక్కడ నివసించే వారిని ఖాళీ చేయించారు. మనోడు మాత్రం సేఫ్! ఏమైతేనేం, తన ప్రతిపాదనకు ప్రేయసి నుంచి ఆమోదం పొందాడు. ఆ ప్రేమ పక్షులు తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు పారిస్ వెళ్లారట.

  • Loading...

More Telugu News