: ప్రపంచ అతిపెద్ద టెలిస్కోపుకు సాఫ్ట్ వేర్ మనదే!
భారత్, అమెరికా, చైనా, జపాన్, కెనడా దేశాలు ప్రపంచంలోనే అతి భారీ టెలిస్కోపును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హవాయి ద్వీపంలోని మౌనా కియా పర్వత శిఖరాగ్రంపై ఈ థర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ)ను ఏర్పాటు చేస్తారు. ఆప్టికల్ ఇన్ ఫ్రారెడ్ టెక్నాలజీతో భూమిపై ఏర్పాటు కానున్న అతిపెద్ద అబ్జర్వేటరీ ఇదే. కాగా, ఈ టెలిస్కోపుకు అవసరమైన కటకాలు (లెన్సులు), సాఫ్ట్ వేర్ ను భారత్ సమకూర్చనుండడం విశేషం. షడ్భుజి ఆకారంలో ఉండే 492 కటకాలను క్రమపద్ధతిలో అమర్చడం ద్వారా ఈ టెలిస్కోపుకు ఓ రూపు తెస్తారు. తనవంతుగా భారత్ 92 కటకాలను అందించనుంది. అంతేగాకుండా, వీటి నియంత్రణ వ్యవస్థలను, అందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను భారతే తయారుచేస్తోందట.