: ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్... ఓటేసిన ఒమర్ అబ్దుల్లా


జమ్మూ కాశ్మీర్, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నేటి ఉదయం నుంచి ప్రారంభమైన నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జమ్మూకాశ్మీర్‌లో విపరీతమైన చలిలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సొనావర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒమర్ ఈ ఎన్నికల్లో సొనావర్, బీర్వా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో దశ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News