: మనకు మాదక ద్రవ్యాలు అమ్మి, ఆ డబ్బుతో బుల్లెట్లు కొని సైన్యంపై దాడులు: మోదీ
భారత యువతకు మాదక ద్రవ్యాలు విక్రయించి, ఆ వచ్చిన డబ్బుతో బుల్లెట్లు కొనుగోలు చేసి దేశానికి రక్షణగా నిలుస్తున్న సైన్యంపై కాల్పులకు తెగబడుతున్నారని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నేటి ఉదయం రేడియోలో జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కొందరు భరతమాత బిడ్డలు డ్రగ్స్ కు అలవాటు పడ్డారని, వారి కుటుంబాలతో పాటు జాతి మొత్తానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల సమస్య యువతను మూడు వైపులా బాధిస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు. యువతను, ముఖ్యంగా చిన్నారులను తల్లిదండ్రులు గమనిస్తుండాలని పిలుపునిచ్చారు.