: హిమాచల్ ప్రదేశ్ లో చిక్కుకున్న పర్యాటకులు


హిమాచల్ ప్రదేశ్ లో గడచిన 24 గంటలుగా కురుస్తున్న మంచు జనజీవనాన్ని ఇబ్బందులు పెడుతోంది. మనాలి తదితర ప్రాంతాలకు వెళ్ళిన పర్యాటకులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఇప్పటివరకూ 600 మంది టూరిస్ట్ లను రక్షించామని, ఇంకా పలువురు మంచు కురుస్తున్న ప్రాంతాల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. రోహ్ తంగ్ పాస్ వద్ద నిలిచిపోయిన వారిలో చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. వచ్చే 24 గంటలలో మరింత మంచు పడే అవకాశం ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News