: జేమ్స్ బాండ్ కొత్త చిత్రం స్క్రిప్ట్ దొంగతనం... సోనీ కంప్యూటర్లపై హాకర్ల ఎటాక్
జేమ్స్ బాండ్ కొత్త చిత్రం 'స్పెక్టర్' పాలిట విలన్లలా పరిణమించారు కొందరు హ్యాకర్లు. సోనీ పిక్చర్స్ కార్యాలయంలోని కంప్యూటర్లపై దాడి చేసిన హ్యాకర్లు సినిమా స్క్రిప్ట్ ను దోచుకున్నారు. దోచుకున్న స్క్రిప్ట్ ను హ్యాకర్లు బహిరంగపరచారని సోనీ స్టూడియో ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, యూకే చట్టాల ప్రకారం స్క్రిప్ట్ కు కాపీరైట్ రక్షణ ఉందని, స్క్రిప్ట్ వివరాలు ప్రచురించినా, మరేదైనా చిత్రంలో వాడినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా, డానియల్ క్రెయిగ్ హీరోగా నటిస్తున్న చిత్రం వచ్చే సంవత్సరం నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.