: మరోసారి ఆస్కార్ బరిలో ఏ.ఆర్.రెహమాన్
భారత సంగీత దర్శక దిగ్గజం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు. ఈ సంవత్సరం రెహమాన్ సంగీత స్వరాలు సమకూర్చిన చిత్రాల్లో కొచ్చాడయాన్, మిలియన్ డాలర్ ఆర్మ్, ద హండ్రెడ్ పుట్ జర్నీ సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. 87వ ఆస్కార్ అవార్డుల కేటగిరిలో ఈ మూడు సినిమాలకూ నామినేషన్లు దక్కాయి. రెహమాన్‌కు 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాకుగాను రెండు ఆస్కార్ అవార్డులు లభించిన విషయం తెలిసిందే. ఈ దఫా కూడా ఆస్కార్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా రహమాన్ నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.