: కేంద్ర మంత్రికి చుక్కలు చూపించిన హైదరాబాద్ ట్రాఫిక్


ఒక్కరోజు పర్యటనకు గాను హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు హైదరాబాద్ ట్రాఫిక్ చుక్కలు చూపించింది. ఈ ఉదయం ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లతో భేటీ అనంతరం నాంపల్లిలోని బీజేపీ ఆఫీసుకు ఆయన వెళ్లారు. ఆ తర్వాత జేఎన్టీయూలో జరగనున్న ఓ కార్యక్రమానికి హాజరవడానికి సాయంత్రం 4.30కి బీజేపీ కార్యాలయం నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో సిటీ ట్రాఫిక్ ఆయనకు చుక్కలు చూపించింది. 5.45 గంటలకు ఆయన జేఎన్టీయూ చేరుకున్నారు. అక్కడ కూడా కార్యక్రమం జరిగే వెన్యూ చేరుకోవడానికి మరో 15 నిమిషాలు పట్టిందట. సాధారణంగా కేంద్ర మంత్రులు పర్యటించేటప్పుడు ఎస్కార్ట్ వాహనం, పైలట్ వాహనం ఉంటాయి. ట్రాఫిక్ క్లియర్ చేసే అవకాశం కూడా ఉంది. అయినా, రవిశంకర్ ప్రయాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ విషయంపై కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ వివరాలను స్వయంగా జేఎన్టీయూలో ప్రసంగిస్తున్న సందర్భంగా వెల్లడించారు.

  • Loading...

More Telugu News