: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పోస్టల్ సర్కిల్: కేంద్రం
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పోస్టల్ సర్కిల్ ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించారు. హైదరాబాదులో ఐటీఐఆర్ కు మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఏర్పాటుపై కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే నగరంలో ఉన్న ఐటీ కంపెనీలు ఐటీఐఆర్ లో విస్తరణ చేపట్టవచ్చని మంత్రి సూచించారు. ఈరోజు హైదరాబాదు వచ్చిన రవి శంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పైవిషయాలు తెలిపారు. అంతకుముందు మంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకోసం గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.160 కోట్ల నిధులు సరిపోవని వాటిని పెంచాలని కేంద్ర మంత్రిని కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం గురించి కేంద్ర మంత్రికి వివరించారు.