: వంశీచంద్ రెడ్డి వైఎస్ అనుచరుడు... చట్టప్రకారమే తేల్చుకుంటా: మాజీ ఎమ్మెల్యే విష్ణు
ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడని మాజీ ఎమ్మెల్యే విష్ణు పేర్కొన్నారు. నిన్న జరిగిన గొడవ తాలూకు సీసీ వీడియో పుటేజీ బయటపడడం, అందులో ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే విష్ణు కొట్టినట్టు స్పష్టం కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. వంశీ చంద్ రెడ్డిపై తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. వంశీచంద్ రెడ్డిని పిలిచి మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, తనను మాత్రం వివరణ అడగలేదని ఆయన ఆరోపించారు. వంశీచంద్ రెడ్డిని చట్టప్రకారమే ఎదుర్కొంటానని విష్ణు స్పష్టం చేశారు. గతంలో షాపింగ్ మాల్ వ్యవహారంలో వంశీచంద్ రెడ్డిపై పలు కేసులు ఉన్నాయని విష్ణు తెలిపారు. తనను రెచ్చగొట్టడం వల్లే తాను అతనిని కొట్టానని చెప్పిన విష్ణు, చివరికి తానే కొట్టానని ఒప్పుకున్నారు.