: తాజ్ ను సందర్శించనున్న బరాక్ ఒబామా!
నిలువెత్తు ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న తాజ్ మహల్ ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సందర్శించనున్నారు. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తన భారత పర్యటనలో భాగంగా ఒబామా, తాజ్ ను సందర్శించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా రికార్డులకెక్కనున్న ఒబామా వచ్చే నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్ లోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. ఒబామా తాజ్ సందర్శన ఇంకా ఖరారు కానప్పటికీ, ఆయన పర్యటించే ప్రదేశాల్లో తాజ్ మహల్ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం.