: కాశ్మీర్ ఎన్నికల్లో విజయంపై బీజేపీ చీఫ్ ధీమా


జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామంటున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కాశ్మీర్ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, అందుకే తమ పార్టీకి ఓటేస్తారని షా వివరించారు. ఓ జాతీయ వార్తా చానల్ తో మాట్లాడుతూ, మత ప్రాతిపదికన ఓటర్లను చీల్చడంలో మీడియా బిజీగా ఉందని విమర్శించారు. కానీ, తాము విద్య, విద్యుత్, నీరు వంటి సమస్యలతో ఎన్నికల్లో పోరాడతామని, జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. అంతేగాకుండా, 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఇరుకునపెట్టడానికి తాము సీబీఐని పావుగా ఉపయోగించుకుంటున్నామన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News