: ఏపీలో పెట్రోల్‌ కావాలంటే ‘ఆధార్’ ఇవ్వాల్సిందే!


ఆంధ్రప్రదేశ్ లో ఇకపై పెట్రోల్ కొనాలంటే డ్రైవింగ్ లైసెన్సు, ఆర్ సి లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. వాహనదారులు, డ్రైవింగ్ లెసైన్సులు కలిగి ఉన్న వారి నుంచి ఆధార్ అనుసంధానం కోసం పెట్రోల్ బంకులను ఆశ్రయించాలని రవాణాశాఖ నిర్ణయించటమే ఇందుకు కారణం. ఈ విషయమై హెచ్‌పీసీఎల్, బీపీఎల్, ఐఓసీ ఆయిల్ కంపెనీలతో చర్చిస్తూ, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చేసిన ప్రతిపాదనలను ఆయిల్ కంపెనీల ప్రతినిధులు అంగీకరించడంతో, త్వరలోనే జీవో విడుదల కానున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 72 లక్షల వాహనాలు, 41 లక్షల డ్రైవింగ్ లెసైన్సులు ఉన్నట్టు గుర్తించిన అధికారులు, ఆధార్ అనుసంధానం కోసం నాలుగు నెలల నుంచి ప్రయత్నిస్తున్నా, ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో పెట్రోల్ బంకుల్లోనే ఆధార్ అనుసంధాన ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 13వ తేదీ నుంచి టాస్క్‌ఫోర్సు టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 13వ తేదీ తరువాత తొలిసారి పెట్రోల్ కోసం బంకుకు వచ్చే ప్రతి వాహనదారూ సి బుక్, డ్రైవింగ్ లెసైన్సు, ఆధార్ కార్డులను వెంట తీసుకుని రావాల్సి ఉంటుంది. ఒకసారి వాటిని తీసుకుని రాకపోతే మరో అవకాశం ఇస్తారు. అక్కడిక్కడే వాటిని ఆధార్‌తో అనుసంధానం చేయాలన్నది వారి ఉద్దేశం. ఈ ప్రక్రియైనా ఫలితమిస్తుందో లేదో!

  • Loading...

More Telugu News