: ఇక బీహార్ మంత్రులకు బంధువులే పీఏలు


బీహార్ లో పరోక్షంగా బంధుస్వామ్యానికి తెరలేపారు! ఇకపై బీహార్ మంత్రులు తమ బంధువులను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవచ్చు. ఈ మేరకు నిబంధనలను సవరించారు. కొన్నివారాల క్రితం సీఎం జీతన్ రామ్ మాంఝి అల్లుడి విషయంలో వివాదం నెలకొంది. దీంతో, ఆయన సీఎం వ్యక్తిగత కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, కొత్త నిబంధనలకు ఊపిరి పోశారు. తాజా రూల్సు ప్రకారం, మంత్రులు తమ దగ్గరి బంధువులను, కుటుంబ సభ్యులను పీఏలుగా నియమించుకోవచ్చు. అయితే, మంత్రుల భార్యా పిల్లలు, తల్లిదండ్రులు మాత్రం కార్యదర్శులుగా వ్యవహరించేందుకు అనర్హులు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీనిపై బీజేపీ శాసనసభాపక్ష నేత సుశీల్ కుమార్ మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు.

  • Loading...

More Telugu News