: జవహర్ నగర్ పేలుడులో చిన్నారి బాలిక మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం


హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన పేలుడులో గాయడపడ్డ చిన్నారి బాలిక కీర్తివాణి మరణించింది. ఈ ఘటనలో గాయపడ్డ నర్సమ్మ, వాగిల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. జవహర్ నగర్ లోని ఓ ఇంటిలో సంభవించిన పేలుడుతో అక్కడికి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి బాలికలు ముగ్గురూ తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా, చికిత్స అందిస్తుండగానే కీర్తివాణి మరణించింది. ఇదిలా ఉంటే, పేలుడుకు దారి తీసిన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.

  • Loading...

More Telugu News