: మోదీ మాటకు విలువ... జూన్ 21వ తేదీని 'వరల్డ్ యోగా డే'గా ప్రకటించిన ఐరాస


ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని 'వరల్డ్ యోగా డే'గా ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తిని గౌరవిస్తూ ఐరాస ఈ నిర్ణయం తీసుకుంది. ఐరాస తాజా నిర్ణయం భారత్ కు దౌత్యపరంగా అతిపెద్ద విజయం అని చెప్పుకోవచ్చు. గత సెప్టెంబరులో ఐరాస సాధారణ సభలో ప్రసంగించిన సందర్భంగా మోదీ యోగాను గుర్తించాలని ప్రతిపాదించారు. అందుకు 170 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా మద్దతు పలికింది. అంతర్జాతీయ సమాజంలో మోదీ పట్టు క్రమంగా పెరుగుతోందనడానికి ఐరాస ప్రకటన నిదర్శనంలా నిలుస్తోంది.

  • Loading...

More Telugu News