: మోదీకి డెంగ్యూ వ్యాధి సోకినట్టుంది: వీహెచ్


భారత ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి డెంగ్యూ వ్యాధి సోకినట్టుందని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. దేశంలో మతమార్పిడులకు బీజేపీ, దాని అనుబంధ సంస్థలు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. భారత్ ఒక లౌకిక రాజ్యమని, దాన్ని హిందూ దేశంగా ఎన్నటికీ మార్చలేరని అన్నారు. ప్రధాని పీఠాన్ని మోదీ అధిరోహించిన తర్వాత ఇలాంటి దారుణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మతమార్పిడులను ప్రోత్సహించడం బీజేపీకి తగదని సూచించారు.

  • Loading...

More Telugu News