: నేడు తిరుపతికి వైసీపీ అధినేత వైఎస్ జగన్


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుపతి వెళ్లనున్నారు. నేటి మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లనున్న జగన్, చిత్తూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమీక్షలో జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారని పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి చెప్పారు. ఈ సమావేశం తర్వాత ప్రవాస భారతీయుడు చెన్నారెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ కు జగన్ హాజరుకానున్నారు. తదనంతరం ఈ రోజు రాత్రి ఆయన తిరుపతి నుంచి తన సొంతూరు పులివెందులకు వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News