: కొత్తపల్లి గీతకు వైసీపీ షాక్...లోక్ సభలో ఉపనేతగా తొలగింపు


వైసీపీ టికెట్ పై అరకు నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఆ పార్టీ ఎంపీ కొత్తపల్లి గీతకు పార్టీ అధిష్ఠానం షాకిచ్చింది. ఇప్పటిదాకా లోక్ సభలో పార్టీ ఉపనేతగా కొనసాగుతున్న ఆమెను ఆ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తపల్లి గీతను పదవి నుంచి తప్పించాలని పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు లేఖ రాశారు. గీత స్థానంలో పార్టీ ఉపనేతగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను నియమించాలని ఆయన ఆ లేఖలో స్పీకర్ ను కోరారు. వైసీపీ టికెట్ తో విజయం సాధించిన కొత్తపల్లి గీత, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీతో రాసుకుని, పూసుకుని తిరుగుతున్నారు. అంతేకాక వైసీపీపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News