: అలిపిరిలో బాంబు పెట్టామంటూ కర్ణాటక డీజీపీకి ఫోన్లు...తిరుమల, తిరుపతిలో హై అలర్ట్!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తిరుపతిలో ఉండగానే కర్ణాటక డీజీపీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రెండు సార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. అలిపిరిలో బాంబు పెట్టామని, మరికొద్దిసేపట్లో వాటిని పేల్చివేయనున్నట్లు ఆ వ్యక్తులు చెప్పడంతో కర్ణాటక డీజీపీ, ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. పదకొండేళ్ల క్రితం చంద్రబాబుపై మావోయిస్టులు అలిపిరి వద్ద బాంబు దాడి చేయడం, ప్రస్తుతం కూడా ఆయన తిరుపతిలోనే ఉండటం తదితర కారణాల వల్ల పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. అలిపిరి సహా, తిరుపతి నగరంలోని బస్సు స్టేషన్, రైల్వే స్టేషన్లు తదితరాలను బాంబ్, డాగ్ స్క్వాడ్ లు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. మరోవైపు తిరుమలలోని కల్యాణ కట్ట, వాహనాల పార్కింగ్ తదితరాల వద్ద కూడా పోలీసులు సోదాలు చేశారు. అయితే ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా జరిగిన పోలీసుల తనిఖీలతో తిరుమలతో పాటు తిరుపతిలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News