: క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే
వరల్డ్ కప్ క్రికెట్ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్ కప్ లో మొత్తం 16 జట్లు పోటీ పడనున్నాయి. ఏ, బీ అంటూ ఈ 16 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. కాగా, ఏ గ్రూప్ లో శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్కాట్ లాండ్, జింబాబ్వే, యూఏఈ చోటు సంపాదించగా, బీ గ్రూప్ లో ఇండియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ జట్లు చోటు సంపాదించాయి. 2015 ఫిబ్రవరి 14 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా, మార్చి 15 వరకు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. వాటిల్లో ప్రతి జట్టు 6 మ్యాచ్ లు ప్రత్యర్థి జట్లతో ఆడనుంది. దాంతో లీగ్ దశ ముగియనుంది. అనంతరం మార్చి 18 నుంచి మార్చి 21 వరకు జరుగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో పాయింట్ల పట్టికలో అగ్రభాగాన నిలిచిన ఎనిమిది జట్లు క్వార్టర్స్ కు చేరనున్నాయి. క్వార్టర్ ఫైనల్ లో విజేతలుగా నిలిచి, పాయింట్ల పట్టికలో అగ్రభాగాన నిలిచిన నాలుగు జట్లు సెమీస్ కు చేరనున్నాయి. ఆ నాలుగు జట్లు మార్చి 24 నుంచి మార్చి 26 వరకు జరిగే సెమీఫైనల్ లో పోటీ పడనున్నాయి. అందులో విజేతగా నిలిచిన రెండు జట్లు మార్చి 29న జరగనున్న ఫైనల్స్ లో పోటీ పడనున్నాయి.