: రక్షణ, ఇంధన, ఆర్థిక రంగాల్లో భారత్, రష్యా సంబంధాలు ధృడమవుతాయి: పుతిన్


రక్షణ, ఇంధన, ఆర్థిక రంగాల్లో భారత్, రష్యా మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు చేసుకున్న ఒప్పందాలు భారత్ ను, రష్యాకు వ్యూహాత్మక భాగస్వామిని చేశాయని అన్నారు. భారత్ లో పెట్టుబడులకు తమ దేశ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. కూడంకుళం తొలి యూనిట్ ను విజయవంతంగా పూర్తి చేసి, ప్రారంభించామని తెలిపిన ఆయన, మిగిలిన మూడు యూనిట్లను కూడా అదే స్ఫూర్తితో పూర్తిచేస్తామని వివరించారు. రష్యాలో అతిపెద్ద చమురు సంస్థ గ్యాస్ ప్రోమ్ భారత్ కు అవసరమైన సహాయం అందజేస్తుందని ఆయన వెల్లడించారు. భారత్, రష్యా మధ్య రక్షణ ఉత్పత్తుల తయారీకి బ్రహ్మోస్ ఒక నిదర్శనమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News