: 20 శాతం పెరిగిన దక్షిణ మధ్య రైల్వే ఆదాయం


దక్షిణమధ్య రైల్వే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్, నవంబర్ మధ్య కాలంలో రూ.8,103 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి సాంబశివరావు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో వచ్చిన ఆదాయం రూ.6,738 కోట్లతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని ఆయన వివరించారు. నవంబరు 2014 నాటికి పది మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి, 2013తో పోలిస్తే, 19.6 శాతం వృద్ధిని సాధించామని చెప్పారు. సిమెంటు రవాణాలో 6 శాతం పెరుగుదల నమోదైందన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి 3.2 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని రవాణా చేసినట్లు సాంబశివరావు తెలిపారు.

  • Loading...

More Telugu News