: ఏపీలో ఐదుగురు ఐఏఎస్ ల బదిలీ


ఆంధ్రప్రదేశ్ లో తాజాగా ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా డి.సాంబశివరావు, మున్సిపల్ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శిగా ఎ.గిరిధర్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా అజయ్ జైన్ ను బదిలీ చేసింది. అంతేకాక మౌలిక సదుపాయాల సంస్థ వీసీ, ఎండీగా జైన్ కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. ఇక సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా సునీతకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు గుల్జార్, ఎంజీ గోపాల్ లకు ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వలేదు. వారిద్దరూ సాధారణ పరిపాలన విభాగాన్ని సంప్రదించాలని ప్రభుత్వం ఆదేశించింది. వారిలో గుల్జార్ ఇప్పటికే కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News