: ఆరేళ్ళ ప్రేమకు గుడ్ బై చెప్పిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' జంట
ఆస్కార్ అవార్డుల బరిలో భారత ఖ్యాతిని పెంచిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' హీరో, హీరోయిన్లు తమ ఆరేళ్ళ ప్రేమాయణానికి స్వస్తి పలికారట. ఫ్రిదా పింటో తన దీర్ఘకాల బాయ్ ఫ్రెండ్ దేవ్ పటేల్ కు 'బై' చెప్పినట్టేనని తెలుస్తోంది. ఇటీవల 30వ జన్మదినాన్ని జరుపుకున్న ఫ్రిదా పింటో తన బర్త్ డే పార్టీకి దేవ్ ను ఆహ్వానించలేదట. దీనికి తోడు కొంత కాలంగా ఫ్రిదా, వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ తో కలసి కనిపిస్తూ ఉండటంతో ఇక దేవ్ పటేల్ తో బంధం తెగినట్టేనని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.