: రాజధాని మాస్టర్ ప్లాన్ కు చిల్లిగవ్వ కూడా ఖర్చు లేదు: మంత్రి నారాయణ


సకల హంగులతో, అత్యాధునిక ఆకాశ హర్మ్యాలతో నిర్మితం కానున్న నవ్యాంధ్ర రాజధాని మాస్టర్ ప్లాన్ చిల్లిగవ్వ ఖర్చు లేకుండానే రూపొందుతోంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ ఇచ్చేందుకే మన ఇంజినీర్లు వేలకు వేలు గుంజుతున్నారు. మరి వేల కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న రాజధానికి సంబంధించిన ప్లాన్ కు చిల్లిగవ్వ కూడా ఖర్చు కాదంటే నమ్మేదెలా? అది కూడా ప్రసిద్ధ సింగపూర్ నిపుణులు రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్. ఇందులో ఎన్ని ప్రత్యేకతలున్నా, ఖర్చు మాత్రం నిల్లేనంటున్నారు ఏపీ పురపాలక మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన సందర్భంగా ఆయన వ్యవహార శైలికి ముచ్చటపడ్డ ఆ దేశ నిర్మాణ రంగ నిపుణులు ఉచితంగానే మాస్టర్ ప్లాన్ గీసిస్తామని హామీ ఇచ్చారట. అంతేకాదండోయ్, ప్రస్తుతం సదరు సింగపూర్ ప్రతినిధులు మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. త్వరలోనే ఈ ఉచిత మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది.

  • Loading...

More Telugu News