: సైబరాబాద్ పరిధిలో 144 సెక్షన్
సైబరాబాద్ పరిధిలో 24 గంటల పాటు 144 సెక్షన్ విధిస్తూ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువగా గుమిగూడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్ట్యా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు జంట నగరాల పరిధిలో భారీ శబ్దం వెలువరించే సౌండ్ బాక్సుల వినియోగంపై నిషేధం విధించారు. ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.