: హెరిటేజ్ కు ఉత్తమ జాతీయ ఇంధన పొదుపు అవార్డు


డెయిరీ రంగంలో అత్యుత్తమ ఇంధన పొదుపు పద్ధతులు పాటించినందుకు గానూ 2014 సంవత్సరానికి హెరిటేజ్ సంస్థ ఉత్తమ జాతీయ ఇంధన పొదుపు పురస్కారానికి ఎంపికయింది. 2008, 2010, 2012 సంవత్సరాల్లో ఈ అవార్డును హెరిటేజ్ సంస్థ సొంతం చేసుకుంది. తాజా అవార్డుతో నాలుగు సార్లు ఈ అవార్డుకు ఎంపికైన సంస్థగా హెరిటేజ్ నిలవనుంది. డిసెంబర్ 14న ఈ అవార్డును ఢిల్లీలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేతుల మీదుగా హెరిటేజ్ ప్రతినిధులు అందుకోనున్నారు. హైదరాబాదులోని ఉప్పల్ హెరిటేజ్ ప్లాంట్ లో పాటిస్తున్న అత్యుత్తమ ఇంధన పొదుపు పద్ధతుల కారణంగా ఈ పురస్కారం దక్కింది.

  • Loading...

More Telugu News