: మేల్కొన్న టి.ప్రభుత్వం... 40 క్యాబ్ లపై కేసులు, 7 క్యాబ్ లు సీజ్
ఢిల్లీలో ఉబెర్ క్యాబ్ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం మేల్కొంది. హైదరాబాదులో మహిళల రక్షణకు పలు చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం, అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో ఆర్టీఏ విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికులను తరలిస్తున్న క్యాబ్ లను ఆర్టీఏ అధికారులు పట్టుకుంటున్నారు. డ్రైవర్లకు, ప్రయాణికులకు అక్కడికక్కడే కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 40 క్యాబ్ లపై కేసులు నమోదు చేశారు. మరో 7 క్యాబ్ లను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆర్టీఏ అధికారులు వాహనదారులను హెచ్చరించారు.