: జారిపడ్డ పల్లె రఘునాథరెడ్డి... గాయాలతో ఆస్పత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి కొద్దిసేపటి క్రితం గాయాలయ్యాయి. నేటి ఉదయం సచివాలయానికి వచ్చిన ఆయన తన కార్యాలయంలోని యాంటీ రూంలో కొద్దిసేపటి క్రితం జారిపడ్డారు. దీంతో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. దీంతో మంత్రిని అధికారులు హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.