: ఏపీ రాజధాని ప్రాంతాల్లో సింగపూర్ బృందం ఏరియల్ సర్వే


ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని గ్రామాల్లో సింగపూర్ బృందం ఏరియల్ సర్వే నిర్వహించింది. మొదటి విడతలో తూళ్లూరు, రాయపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మందడం, వెంకటపాలెం, హరిచంద్రపునం, బోరుపాలెం గ్రామాల్లో పర్యటించి సర్వే చేశారు. రెండో విడత కృష్ణా నది తీరంలోని లంక గ్రామాలపై ఏరియల్ సర్వే జరిగింది. తరువాత రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రదేశాన్ని ఎంపిక చేస్తారు. ఇక్కడి నుంచి రాజధాని నిర్మాణ ప్రణాళిక మొదలవుతుంది. ప్రకాశం బ్యారేజీకి పశ్చిమం నుంచి కేంద్ర ప్రదేశం మొదలయ్యే అవకాశముంది. కాగా, సింగపూర్, ఏపీ ప్రభుత్వాలు 2015, జూన్ కల్లా రాజధాని ప్రాంత బృహత్ ప్రణాళికను సిద్ధం చేస్తారని మంత్రి పి.నారాయణ నిన్న (మంగళవారం) చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News