: నరేంద్ర మోదీని 'భారత రాష్ట్రపతి' అంటున్న ఓ సెలబ్రిటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంటే, మన సెలబ్రిటీలకు మాత్రం ఆయన గురించి కనీసం కూడా తెలియకపోవడం శోచనీయం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ 8వ సీజన్ లో పాల్గొంటున్న టీవీ, సినీ నటి కరిష్మా తన్నా నరేంద్ర మోదీని 'ప్రెసిడెంట్ అఫ్ ఇండియా' అని చెప్పి, ప్రేక్షకుల నుంచి విమర్శలను ఎదుర్కొంది. అంతే కాదు, '5 X 5 X 0' ఎంత అని అడిగితే... 25 అని ఠక్కున చెప్పి "నేను చాలా షార్ప్" అని సమాధానం ఇచ్చిందట. ఈమె తెలివితేటలకు ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా జోకులు పేలుస్తూ, నవ్వులు పంచుకుంటున్నారు. బిగ్ బాస్ లో 'అత్యంత మొద్దు' అవార్డు ఉంటే అది కరిష్మా తన్నాకే ఇవ్వాలంటూ సెటైర్లు వేస్తున్నారు!