: అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో పాకిస్థాన్ కు 8వ స్థానం
ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో పాకిస్థాన్ కు 8వ స్థానం లభించింది. అమెరికాకు చెందిన ఓ నిఘా సంస్థ ఈ జాబితా రూపొందించింది. ఈ టాప్-10 జాబితాలో, నిత్యం నెత్తురోడే ఇరాక్ కు ప్రథమస్థానం లభించింది. తర్వాతి స్థానాల్లో నైజీరియా, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సిరియా, లిబియా, ఈజిప్టు, కెన్యా ఉన్నాయి. గత 30 రోజుల్లో ఆయా దేశాల్లో జరిగిన టెర్రర్ దాడులు, తిరుగుబాటుదారుల చర్యలు, హెచ్చరికలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా తయారుచేశారు.